ఒక‌టే మోటార్ సైకిల్ మీద 58 మంది... రికార్డు సృష్టించిన భార‌త ఆర్మీ బృందం

  • రికార్డు నెల‌కొల్పిన టోర్న‌డోస్ టీమ్‌
  • గ‌త రికార్డు 56 మంది.. డేర్ డెవిల్స్ బృందం
  • టోర్న‌డోస్ పేరున 19 జాతీయ‌, అంత‌ర్జాతీయ రికార్డులు
ఆదివారం భార‌త ఆర్మీకి చెందిన మోటార్ సైకిల్ ప్ర‌ద‌ర్శ‌న బృందం టోర్న‌డోస్ అరుదైన రికార్డును నెల‌కొల్పింది. 500 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద 58 మంది ఎక్కి 1200 మీట‌ర్ల దూరం ప్ర‌యాణించి ప్ర‌పంచ రికార్డు సృష్టించారు. 2013లో భార‌త ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ బృందం 56 మందితో మోటార్ సైకిల్ న‌డిపిన రికార్డును టోర్న‌డోస్ తిర‌గరాసింది. 1982లో ఏర్ప‌డిన ఈ టోర్న‌డోస్ బృందం పేరు మీద ఇప్ప‌టికి 19 జాతీయ‌, అంత‌ర్జాతీయ రికార్డులు ఉన్నాయి. జాతీయ పతాకం రంగుల్లో టోపీలు ధ‌రించి టోర్న‌డోస్ బృందం చేసిన విన్యాసం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. బెంగళూరులోని ఎల‌హంక ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఈ విన్యాసం చేశారు.
Go Back to Shorts
afs
bengaluru
motor cycle
indian army
tornadoes
dare devils

More Telugu News